
ప్రభాస్,హను రాఘవపూడి కాంబోపై అఫీషియల్‌గా క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు హను రాఘవపూడి ఇదివరకే తెలుపగా..తాజా పూజా ఈవెంట్తో ప్రాజెక్ట్ కన్ఫమ్ అయింది. అలాగే ఈ సినిమాను నిర్మించనున్న మైత్రి మూవీ మేకర్స్ 'హను ప్రభాస్ కాంబో బిగిన్స్' అంటూ పోస్ట్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ ఓ చారిత్రక సంఘటనతో ఇండియన్ ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుందని టాక్.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మూడు పాటల కంపోజింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. హను రాఘవపూడి సీతారామం వంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత తన నెక్స్ట్ మూవీ ప్రభాస్‌తో చేస్తుండంటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం ఈ పూజా ఈవెంట్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The big mannn Rebel Starrrr is here for #PrabhasHanu Pooja Ceremony ❤️?@hanurpudi@MythriOfficial
— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2024
ఈ హిస్టారికల్ లవ్‌స్టోరీకి 'ఫౌజీ' అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. సీతారామం తరహాలోనే ప్రభాస్, హను రాఘవపూడి మూవీ కూడా ఇండియన్ ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగనున్నట్లు తెలిసింది. ఇందులో ప్రభాస్ ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.
డైరెక్టర్ హనురాఘవపుడి బెస్ట్ స్టోరీ టెల్లర్గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. అందాల రాక్షసి మూవీతో ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసిన హను..రీసెంట్ సీతారామం వరకు అంతే ఇంటెన్సిటీ లవ్ ఎమోషన్ను తన మూవీస్లో క్యారీ చేస్తున్నారు. మరి ప్రభాస్ వంటి స్టార్ హీరోని ఎలా చూపించనున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
#Prabhas ??#PrabhasHanu ? pic.twitter.com/MFEHya6yAk
— ︎ ︎ ︎ (@MalikTwtz) August 17, 2024
ప్రస్తుతం ప్రభాస్ వరుస మూవీస్ తో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ తో కల్కి2, ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ 2, ఇక మరోపక్క మారుతి, సందీప్ వంగా మూవీస్ను లైన్ లో పెట్టేశారు. ఇక హను రాఘవపూడి మూవీ రిలీజ్ కావడానికి కనీసం రెండేళ్లు పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో హను రాఘవపూడి వెయిట్ చేస్తాడో..లేక అంతలోపు వేరే మూవీని డైరెక్ట్ చేస్తాడో చూడాలి మరి.