Kannappa: కన్నప్ప మూవీ కోసం భారీ మార్పులు.. ఆ ఇద్దరు స్టార్స్ అవుట్

Kannappa: కన్నప్ప మూవీ కోసం భారీ మార్పులు.. ఆ ఇద్దరు స్టార్స్ అవుట్

మంచు ఫ్యామిలీ నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కన్నప్ప(Kannappa). పరమశివుడి భక్తుడు భక్త కన్నప్ప కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణు(Manchu Vishnu) టైటిల్ రోల్ లో కనిపించనున్నాడు. భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా వస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు  వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న స్టార్స్ ని కీ రోల్స్ కోసం తీసుకుకున్నారు. వారిలో మలయాళం నుండి మోహన్ లాల్, కన్నడ నుండి శివరాజ్ కుమార్, టాలీవుడ్ నుండి ప్రభాస్, తమిళ్ నుండి నయనతార ను తీసుకున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. 

అయితే మిగతావారి విషయంలో ఏమో గానే.. ప్రభాస్, నయనతార విషయంలో మాత్రం మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాలో ప్రభాస్, నయనతార శివపార్వతుల లాగ కనిపించనున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.  అయితే తాజా సమాచారం మేరకు.. ఈ ప్రాజెక్టు నుండి నయనతార బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలో మరో బ్యూటీ కాజల్ అగర్వాల్ నటించనుందట. దీనికి సంబంధించి మంచు విష్ణు, కాజల్ కి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దీంతో ఈ సినిమా నుండి నయనతార బయటకు వచ్చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. శివుడి పాత్రలో ప్రభాస్ కాకుండా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నారట. ఇదే విషయంపై అక్షయ్, మంచు ఫ్యామిలీ మధ్య చర్చలు కూడా జరిగాయి. ఇటీవల ఆయన హైదరాబాద్ కూడా వచ్చాడు. దానికి సంబందించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఇలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుండి ఇద్దరు స్టార్స్ బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.