
హైదరాబాద్: సినీ నటుడు ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23) (Prabhas Birthday) సందర్భంగా హైదరాబాద్లో ఫ్యాన్స్ హంగామా చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ లేన్ రోడ్లో అర్ధరాత్రి పెద్ద సంఖ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ గుమిగూడారు. కొందరు అభిమానులు అత్యుత్సాహంతో ప్రభాస్(Prabhas) ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రభాస్ ఇంటి వద్దకు హుటాహుటిన చేరుకున్నారు. ప్రభాస్ ఇంటి ముందు బర్త్ డే సెలబ్రేషన్ చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని ఫ్యాన్స్కు పోలీసులు నచ్చజెప్పారు.
Huge Crowd Near Darling #Prabhas House ❤️??
#HappyBirthdayPrabhas #RajaSaab #Spirit #Rebelwood #Salaar #PrabhasBirthdayCelebration #SandeepReddyVanga #Kalki28989AD pic.twitter.com/FE5BFvS2MI
— Darling Sandeep (@SandeepReddy259) October 22, 2024
అర్ధరాత్రి పబ్లిక్ న్యూసెన్స్ చేయొద్దని, వెళ్లిపోవాలని ఫ్యాన్స్ను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ అభిమానులు పోలీసుల సూచనను పెడచెవిన పెట్టారు. పెద్దపెద్దగా కేకలేస్తూ రచ్చ చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో రోడ్లపై అభిమానులను చెదరగొడుతూ పోలీసులు లాఠీ ఝుళిపించారు. అప్పటికీ ఫ్యాన్స్ వెనక్కి తగ్గలేదు. రోడ్లపై పరుగులు పెడుతూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ప్రభాస్ బర్త్ డే చేయనీయకుండా పోలీసులు జులుం ప్రదర్శించారని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడ్డారు.
Huge Fans gathered at #Prabhas Residence (JubileeHills) ???
Mental Rebels Mode on ⚠️⚠️pic.twitter.com/nfYCrm0k4J
— Filmy Bowl (@FilmyBowl) October 22, 2024
ఒకప్పుడు హీరోల ఇంటి ముందు అభిమానులు ఇంతలా గుమిగూడి బర్త్ డే చేయడానికి యత్నించిన సందర్భాలు లేవు. కానీ.. ఇటీవల ఇదో ట్రెండ్ అయిపోయింది. అభిమాన హీరో ఇంటికి వెళ్లి అతనితో ఫొటోలు, సెల్ఫీలు దిగామని, అతని బర్త్ డేను సెలబ్రేట్ చేశామని చెప్పుకోవడం, ఇన్స్టాలో స్టోరీగా పెట్టుకోవడం, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోవడం ప్రెజెంట్ ట్రెండ్.
ఉద్యోగాల చేసుకుంటూనో, కోచింగ్లు తీసుకుంటూనో హైదరాబాద్లో ఉంటున్న హీరోల అభిమానులు అభిమాన హీరో బర్త్ డే వచ్చిందంటే చాలు, ఆ హీరోల ఇళ్ల ముందుకు వెళ్లి నానా హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఇంట్లో నుంచి బయటకు వచ్చి అభివాదం చేసిన హీరోలను మనం చూశాం. రీరిలీజ్ ట్రెండ్ కూడా అభిమానుల కోసం తీసుకొచ్చిందే. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఈశ్వర్’ సినిమాను రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.