కార్ కలర్ మార్చిన ప్రభాస్ - సిటీ రోడ్లపై కిర్రాక్ ఎట్రాక్షన్

కార్ కలర్ మార్చిన ప్రభాస్ - సిటీ రోడ్లపై కిర్రాక్ ఎట్రాక్షన్

సెలెబ్రిటీలు వాడే కార్స్, గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్, పట్ల నెటిజన్లలో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కార్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రభాస్ వాడే ఖరీదైన ఆరెంజ్ కలర్ లాంబోర్గిని కార్ బ్లాక్ కలర్ మారటమే ఇందుకు కారణం. ఇటీవల కాలంలో కార్ ర్యాపింగ్ ట్రెండ్ ఎక్కువయ్యింది. ప్రభాస్ కూడా అదే ట్రెండ్ ని ఫాలో అవుతూ తన కార్ కలర్ ని మార్చేశాడు.

ప్రభాస్ వాడుతున్న ఈ లగ్జరియస్ కార్ ధర 5.8 కోట్లు ( ఎక్స్ - షోరూం ). ప్రభాస్ గ్యారేజ్ లో ఉన్న అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ( 8కోట్లు ) తర్వాత ఖరీదైన కార్. సాధారణంగా సింపుల్ గా కనిపించే ప్రభాస్ కార్ల విషయంలో మాత్రం అందరికంటే హాయ్ రేంజ్ మెయింటైన చేస్తుంటాడు.

తాజాగా సిటీ రోడ్ల మీద చక్కర్లు కొడుతున్న ప్రభాస్ కార్ నెటిజన్ల కెమెరా కంటికి చిక్కటంతో ఆ ఫోటోలు కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా, కార్ కలర్ మార్చటం పెరుగుతున్న ట్రెండ్ లో భాగమేనా లేక ఇంకేదైనా కారణం ఉందా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.