
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడంతా దీపికా పదుకొనే గురించే చర్చ. నీతి, నైతిక విలువలు అనే పదాలను బాగా వాడుతున్నారు సినీ విమర్శకులు, ఫ్యాన్స్. దీనికి కారణం.. బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికాపదుకొనే చేసిన పనే. ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ నుంచి తప్పుకున్న ఈ సుందరి.. ఈగోతో చేసిందో.. ఈర్ష్యతో చేసిందో కానీ.. మూవీకి డ్యామేజ్ చేసే ప్రయత్నం ఆమె సైడ్ నుంచి జరిగింది. దీంతో.. ఓ పెద్ద వివాదమే చెలరేగింది.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ‘స్పిరిట్’ మూవీ ప్లాన్నింగ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా మొదట్లో దీపికాను అనుకున్నారు. అయితే షూటింగ్ డేట్స్ విషయంలో ఎక్కడలేని కండిషన్స్ పెట్టేసరికి పక్కన పెట్టారు. దీపికా స్థానంలో త్రిప్తి దిమ్రి ని తీసుకోవాలని నిర్ణయించుకుంది టీమ్.
అంతవరకు బానే ఉంది.. అయితే ప్రాజెక్ట్ నుంచి తప్పించడంపై ఫీల్ అయిన దీపికా.. సినిమాకు సంబంధించి స్టోరీని లీక్ చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. దీపికా పీఆర్ టీమ్.. ఈ సినిమాకు డ్యామేజ్ చేసేలా స్టోరీ థీమ్ ఏంటో ఆర్టికల్స్ పబ్లిష్ చేయడం.. సోషల్ మీడియాలో లీక్ చేయడం లాంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారు. స్పిరిట్ పూర్తిగా ఏ-రేటెడ్ (A-rated) సినిమా అని.. చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయని చెప్పడం సెన్సేషనల్ అయ్యింది.
దీనిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపికాను హెచ్చరిస్తూ ఎక్స్ లో చాలా తీవ్రంగా పోస్ట్ పెట్టడం మరింత చర్చకు దారితీసింది. సినిమాలో ఏ రేటెడ్ సీన్స్ ఉన్నాయని స్టోరీ లీక్ చేసే ప్రయత్నం చేశారు. ఇది దీపికాకు, ఆమె పీఆర్ టీమ్ కు ఎంత వరకు న్యాయంగా అనిపించింది. దీపిక స్థానంలో త్రిప్తి దమ్రిని తీసుకోవడం ఆమె అక్కసుకు కారణం అయినట్లుంది. కండిషన్స్ కుదరనప్పుడు వేరే వారిని తీసుకోవడం కామన్. ఒక సినిమాకు ఎంతో మందిని అనుకుంటాం. ఫైనల్ అయ్యే వరకు చాలా మంది పేర్లు మారిపోతాయి. అలాగని స్టోరీ లీక్ చేయాలనుకోవడం.. దీపిక నైతిక విలువలేంటో స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
‘‘ఒక స్టోరీ హీరో లేదా హీరోయిన్ కు చెప్పినప్పుడు వారిపై 100 శాతం నమ్మకంతో చెప్తాం. ఎవరికీ చెప్పొద్దు అనే అప్రకటిత అగ్రిమెంట్ ఇండస్ట్రీలో ఉంటుంది. కానీ మీరు స్టోరీ లీక్ చేశారు. మీరు అంటే ఇదా..? ఒక యంగ్ హీరోయిన్ ను టార్గెట్ చేయడం.. స్టోరీని లీక్ చేయడం.. మీరు చెప్పే ఫెమినిజం అంటే ఇదేనా..? ఒక సినిమా కోసం ఫిలిం మేకర్ గా ఎంతో ఎఫోర్ట్ పెడతాను.. ఫిలిం మేకింగ్ నాకు ఎవిరిథింగ్.. నాకే కాదు ఆల్మోస్ట్ అందరికీ.. ఇది మీకు తెలియదు.. ఈ విషయం మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు.. మీ లాంటి వాళ్లకు అర్థం కాదు. అయితే ఒక పని చేయండి.. మరో సారి స్టోరీ మొత్తం చెప్పేయండి.. ఎందుకంటే నాకు కొంచెం కూడా ఫరక్ పడదు. డర్టీ పీఆర్ గేమ్స్.. ’’ అంటూ బ్లాస్ట్ అయ్యారు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి ట్వీట్ కు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ క్రిటిక్స్ కూడా సప్పోర్ట్ చేస్తున్నారు. దీపికాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తు్న్నారు. స్పిరిట్ మూవీ విషయంలో దీపికా పెట్టిన కండిషన్స్ చూసినవాళ్లెవ్వరూ.. ఆమెతో సినిమా చేయడానికి ఒప్పుకోరు.. క్రేజ్ ఉందికదా అని .. ఇష్టమొచ్చిన రూల్స్ పెడితే ఎవరు తీసుకుంటారు.. అయినా సినిమాకు నటీనటులు ఎవరు కావాలో డైరెక్టర్ ఇష్టం. అడ్జస్ట్ కాలేనపుడు వేరే వాళ్లను తీసుకోవడం కామన్. అంతదానికి.. స్టోరీ లీక్ చేసి.. ప్రాజెక్ట్ కు డ్యామేజ్ చేయాలనుకోవడం దారుణం.. అంటూ సందీప్ రెడ్డికి సప్పోర్ట్ చేస్తున్నారు.
When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You've 'DISCLOSED' the person that you are....
— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025
Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…