ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చ కోపం.. ఓం రౌత్ కనిపిస్తే కొట్టేట్టు ఉన్నారు

ప్రభాస్ ఫ్యాన్స్ పిచ్చ కోపం.. ఓం రౌత్ కనిపిస్తే కొట్టేట్టు ఉన్నారు

ఆదిపురుష్ ఎలా ఉంది అంటే.. ఎవడ్రా వాడు.. ఆ డైరెక్టర్ ఓంరౌత్ అంట.. వాడు కాని ఇప్పుడు కనిపిస్తే.. పిచ్చ కొట్టుడు కొట్టాలి.. ఇంత కసిగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాష్ ఫ్యాన్స్. ఆదిపురుష్ మూవీ రిలీజ్ తర్వాత ధియేటర్ల దగ్గర సందడి ఏమో కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం లోలోపల రగిలిపోతున్నారు. సినిమాలో కథ అంటారా.. అందరికీ తెలిసిందే అయినా.. తీసిన విధానం.. ప్రభాస్ మేకోవర్ అనేవి అస్సలు నచ్చటం లేదు ఫ్యాన్స్ కు. రాజుగా చూసిన హీరోను.. దేవుడిగా చూసి మురిసిపోదాం అనుకున్న ప్రభాస్ ఫ్యాన్స్.. సినిమాలో గెటప్స్ చూసి లోలోపల బాగా ఫీలవుతున్నారు. బయటకు అనలేకపోయినా.. డైరెక్టర్ ఓంరౌత్ కనిపితే మాత్రం బడిత పూజ చేయటం ఖాయంగా కనిపిస్తుంది. 

ఇదంతా ఒకటి అయితే రామయణం చరిత్రలోనే.. మొదటిసారి అనుకుంటాం.. సినిమా చూసి వచ్చిన తర్వాత రావణుడిని కాకుండా డైరెక్టర్ ను తిట్టటం అనేది ఇదే కావటం విశేషం. రామయణాన్ని మూడు ముక్కల్లో చెప్పాలంటే వారధి కట్టే.. రావణుడికి కొట్టే.. సీతను తెచ్చె అనొచ్చు.. ఆదిపురుష్ సినిమా చూసిన తర్వాత.. ఓంరౌత్ ను కట్టేసి కొట్టె అన్నట్లు ఉంది. ఆదిపురుష్ సినిమాకు అసలు విలన్ ఇప్పుడు డైరెక్టర్ ఓంరౌత్ కావటం అత్యంత విశేషంగా చెప్పుకోదగిని అంశం. 

సినిమాలో ఓ సందర్భంలో రాముడి వేషధారణ అనేది ఓ బాబా.. మరో దేవుడిని గుర్తుకు చేయటం అనేది ప్రభాస్ ఫ్యాన్స్ ను జీర్ణించుకోలేకుండా చేస్తుంది. 

వందేళ్ల సినీ చరిత్రలో.. దేశంలోని అన్ని భాషల్లో రామయణం సినిమా వచ్చింది.. డైరెక్టర్ ఓంరౌత్ లా ఎవరు తీయలేరు అనేది ఇప్పుడు ఉన్న టాక్.. సినిమా బాగుందా లేదా అనేది పక్కనపెడితే.. ఆ ఓం రౌత్ ఎక్కడ ఉంటాడు.. వాడి సంగతి చూడాలన్నంత కసి, కోపంతో రగిలిపోతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్..