ప్రాజెక్టు K లో ప్రభాస్ లుక్ ఎలా ఉంది? ఆడియన్స్ రియాక్షన్ ఏంటి?

ప్రాజెక్టు K లో ప్రభాస్ లుక్ ఎలా ఉంది? ఆడియన్స్ రియాక్షన్ ఏంటి?

Project K: గత కొంతకాలంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ప్రభాస్ హీరోగా చేస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ప్రాజెక్ట్ K(Project K) నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్(Prabhas first look) ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించనున్నారు అనే సస్పెన్స్ కు తెరదించారు మేకర్స్. 

ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎలా ఉంది?

ప్రభాస్ ఫస్ట్ లుక్ గురించి చెప్పాలంటే.. చాలా కొత్తగా, డిఫరెంట్ గా ఉంది. సూపర్ హీరో గెటప్ లో ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవల్లో కనిపించారు. ఒంటికి ఆర్మర్స్ వేసుకొని ఒక యుద్ధ వీరుడిలా కనిపించారు ప్రభాస్. ప్రపంచాన్ని నాశనం చేద్దామనుకునే రాక్షసులను చండాడే కొత్త అవతారంలా ఉంది ఈ లుక్.

ALSO READ :మెగా ప్రిన్సెస్ క్లీంకారకు.. NTR అదిరిపోయే గిఫ్ట్

ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ రియాక్షన్ ఏంటి?

ప్రాజెక్ట్ K సినిమా నుండి రిలీజైన ప్రభాస్ ఫస్ట్ లుక్ కు ఫ్యాన్స్ నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు కనిపించని కొత్త లుక్ లో ప్రభాస్ ఇరగదీశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. హాలీవుడ్ వాళ్లకి ఐరన్ మ్యాన్ ఉంటే మాకు మా సూపర్ హీరో ప్రభాస్ ఉన్నాడు అంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. అయితే ఈ లుక్ పై నార్మల్ ఆడియన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ లుక్ అస్సలు బాలేదని, ఎవరిదో బాడీకి ప్రభాస్ తల అతికించినట్టుగా ఉందని ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. మనకెందుకన్నా ఈ పాన్ ఇండియా సినిమాలు నార్మల్ లుక్ లో ఒక సినిమా చెయ్ బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక మొత్తంగా ప్రాజెక్ట్ K లో ప్రభాస్ లుక్ కి ఆడియన్స్ నుండి మిక్సెడ్ టాక్ వస్తోంది. మరి జులై 20న రిలీజ్ కానున్న గ్లింప్స్ అయినా ఆడియన్స్ ను మెప్పిస్తుందా అనేది చూడాలి.