
RRR మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. వీరి మధ్య ఉన్న స్నేహం కూడా ఎల్లలు దాటేసింది. ఇటీవల చరణ్.. ఉపాసన దంపతులకు కూతురు పుట్టిన విషయం తెలిసేందే..తాజాగా ఎన్టీఆర్..ఒక అదిరిపోయే గిఫ్ట్ ను చెర్రీ కూతురు క్లీంకార కు ఇచ్చినట్లు తెలుస్తోంది.
చరణ్, ఉపాసన, క్లీంకార పేర్లతో ఉన్న గోల్డ్ డాలర్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించి ఇచ్చారని.. దాని విలువ చాలానే ఉంటుందని సమాచారం. స్పెషల్ గా చేయించిన ఆ గిఫ్ట్ ను NTR అభయ్ రామ్, భార్గవ్ రామ్ చేతుల మీదుగా చెర్రీ దంపతులకు అందించినట్లు తెలుస్తోంది. దీంతో వీరి మధ్య ఉన్న దోస్తాన్ కు నందమూరి ఫ్యాన్స్.. మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ALSO READ :ప్రాజెక్ట్ K నుండి ప్రభాస్ డిఫరెంట్ లుక్.. ఇండియన్ మైథాలజీకి లింక్?
రామ్ చరణ్ తండ్రి కాబోతున్నట్లు మొదట ఎన్టీఆర్ తోనే షేర్ చేసుకున్నట్లు ఇది వరకే తెలుపుగా.. ఇక మెగా ప్రిన్సెస్ రాకతో అభిమానులు సైత ఖుషి అవుతున్నారు. క్లీంకార పేరును లలితా సహస్రనామం నుంచి తీసుకున్నాం అంటూ ..ఈ పేరు ఒక ఆధ్యాత్మికతను మేలుకొలిపే పరివర్తనను.. స్వచ్ఛమైన శక్తిని ఈ పేరు సూచిస్తుంది అని ఉపాసన రీసెంట్ గా ట్వీట్ చేశారు.