
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠానిప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ అంచనాలున్న ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ ను అమెరికాలోని సాన్ డియాగోలో నిర్వహించే ప్రతిష్టాత్మక కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఈవెంట్ లో పాల్గొననున్న ఫస్ట్ ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K రికార్డ్ క్రియేట్ చేసింది.
ALSO READ :ప్రాజెక్ట్ K కామిక్ కాన్ ఈవెంట్ కు దీపికా పదుకొణే దూరం..ఎందుకంటే?
ఈ కార్యక్రమంలో ప్రభాస్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక తాజాగా ప్రాజెక్ట్ K సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ఆర్మర్స్ వేసుకొని చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇండియన్ మైథాలజి తో లింక్ ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
The Hero rises. From now, the Game changes ?
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2023
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/AEDNZ3ni5Q@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7… pic.twitter.com/oRxVhWq4Yn