ప్రాజెక్ట్ K కామిక్ కాన్ ఈవెంట్ కు దీపికా పదుకొణే దూరం..ఎందుకంటే?

ప్రాజెక్ట్ K కామిక్ కాన్ ఈవెంట్ కు దీపికా పదుకొణే దూరం..ఎందుకంటే?

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్‍ మూవీ ప్రాజెక్ట్ కే(Project K). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్‍గా ప్రాజెక్ట్ కే మూవీను రూపొందిస్తున్నారు.ఈ మూవీ ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్(San Diego Comic-Con ) ఈవెంట్‍లో అడుగుపెట్టనున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కే’ చరిత్ర సృష్టించనుంది. జూలై 19న జరిగే ఈ ఈవెంట్‍లో ప్రాజెక్ట్ కే అఫీషియల్ టైటిల్, టీజర్‌ను చిత్ర యూనిట్ ప్రకటించనున్న విషయం తెలిసేందే. 

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణే(Deepika Padukone) కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అందుకు కొన్ని రోజుల నుంచి హాలీవుడ్ లో సమ్మె జరుగునతున్న కారణంగా దీపికా ప్రాజెక్ట్ కే కామికన్ షో లో పాల్గొనకపోవొచ్చు అంటున్నారు.

హాలీవుడ్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్-అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ (SAG) కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో  యాక్టరస్ దీపికా పదుకొణే శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో భాగం కాలేకపోవొచ్చు. ఎందుకంటే SAG లో సభ్యురాలైనా దీపికా SAG-AFTRA హాలీవుడ్ నటుల యూనియన్‌కు సంఘీభావం తెలుపునున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను ప్రాజెక్ట్ K ఈవెంట్‌ను మిస్ కానున్నదని టాక్ వినిపిస్తోంది. 

ALSO READ :ప్రాజెక్ట్ K నుండి ప్రభాస్ డిఫరెంట్ లుక్.. ఇండియన్ మైథాలజీకి లింక్?

"SAG-AFTRA సమ్మె జరుగుతున్నందున, SAG లోని సభ్యులు ఎటువంటి ప్రచార లేదా ప్రచార సేవలను అందించలేరని యూనియన్ పేర్కొంది. "ఇది శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్ వంటి సమావేశాలకు కూడా ఈ నిబంధన వర్తించనుంది. దీంతో ఈ రూల్ ప్రకారం, SAG-AFTRA సభ్యురాలుగా ఉన్న దీపికా వారి సభ్యత్వ నిబంధనలకు అనుగుణంగా  కామిక్-కాన్ ఈవెంట్ కు  హాజరుకాదు..అని SAG-AFTRA సభ్యుల్లోని ఒక ప్రముఖ వ్యక్తి తెలిపినట్లు సమాచారం. ఇటీవల, నటుడు-నిర్మాత ప్రియాంక చోప్రా జోనాస్ కూడా సమ్మెకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసేందే. 

ఈ ప్రాజెక్ట్ కే మూవీలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.  వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.