బిజీ షెడ్యూల్‌‌లోనూ కన్నప్ప కోసం.. ప్రభాస్ ఫ్యాన్స్కి ఫీస్ట్

బిజీ షెడ్యూల్‌‌లోనూ కన్నప్ప కోసం.. ప్రభాస్ ఫ్యాన్స్కి ఫీస్ట్

సలార్(Salaar) తో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్(Prabhas).. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు నాగ్ అశ్విన్(Nag Ashwin) రూపొందిస్తున్న కల్కి(Kalki), మరోవైపు మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్(Raaja sab) చిత్రంలో నటిస్తున్నాడు. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) డైరెక్షన్‌‌లో స్పిరిట్(Spirit), అలాగే హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్‌‌మెంట్స్ ఉన్నాయి.

ఇంత బిజీ షెడ్యూల్‌‌లోనూ మరో సినిమా కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చాడు. మంచు విష్ణు(Manchu Vishnu)  హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న కన్నప్ప(Kannappa) మూవీ షూటింగ్‌‌లో జాయిన్ అయ్యేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. ఫిబ్రవరి సెకెండ్ వీక్‌‌లో సెట్స్‌‌లో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడట. ఇందులో ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడని టాక్.   ‘మహాభారతం’ సీరియల్‌‌ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి సీనియర్స్ స్టార్స్ ఇందులో  కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌‌లో మేజర్  షెడ్యూల్‌ను పూర్తి  చేశారు.