
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ అనుష్క జోడీ అంటే ఫ్యాన్స్ ఎంతో ఇష్టపడుతారనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా ఫిలింనగర్ లో హాట్ టాపిక్ కావాల్సిందే. అయితే లేటెస్ట్ గా ప్రభాస్ గురించి ఓ ఇంటర్వ్యూల్ అనుష్క ఇంట్రెస్టెంట్ విషయాలు చెప్పడంతో మరోసారి ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని, అర్థరాత్రి 3 గంటల సమయంలో కూడా మాట్లాడగలిగేంత చనువు అతడితో ఉందని తెలిపింది అనుష్క.
తమ ఇద్దరికీ ఇంకా పెళ్లి కాకపోవడం, కలిసి ఎక్కువ సినిమాలు చేయడంవల్లే తమ మధ్య ప్రేమ ఉందని వదంతులు వచ్చాయని చెప్పింది. తమిద్దర మధ్య ఏమైనా ఉండుంటే ఎప్పుడో చెప్పేవాళ్లమని , తామిద్దరం భావోద్వేగాల్ని దాచుకోలేబని తెలిపింది. తనలాగే ప్రభాస్ వ్యక్తిత్వం కూడా ఒకేలా ఉంటుందని చెప్పుకొచ్చింది స్వీటీ అనుష్క.