ప్రభాస్ న్యూ మూవీ..సంక్రాంతికి ఫస్ట్ లుక్

ప్రభాస్ న్యూ మూవీ..సంక్రాంతికి ఫస్ట్ లుక్

‘సలార్‌‌‌‌’ సినిమాతో మరో సక్సెస్ అందుకున్న ప్రభాస్... బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో మారుతి డైరెక్షన్‌‌లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాత. కొన్ని నెలలుగా రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నప్పటికీ ఇంతవరకూ సినిమా గురించిన అఫీషియల్‌‌ అనౌన్స్‌‌మెంట్ మాత్రం ఇవ్వలేదు. అయితే శుక్రవారం ఏకంగా ఫస్ట్‌‌ లుక్‌‌ రిలీజ్‌‌ అప్‌‌డేట్‌‌ ఇచ్చి సర్‌‌ప్రైజ్ చేశారు.  

ఈ రొమాంటిక్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్ ఫస్ట్‌‌లుక్, టైటిల్‌‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకూ చూడని ఒక కొత్త లుక్‌‌, క్యారెక్టర్‌‌‌‌లో ప్రభాస్‌‌ కనిపించబోతున్నట్టు చెప్పారు.  ‘డైనోసార్ డార్లింగ్‌‌గా ఎలా మారాడో తెలుసుకునేందుకు రెడీగా ఉండండి’ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. మరోవైపు ‘కల్కి 2898 ఎడి’ అనే సైన్స్ ఫిక్షన్ మూవీలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. 

ఐఐటీ బాంబేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు నాగ్ అశ్విన్.. ఇది చాలా డిఫరెంట్ సినిమా అని, మనదేశంలోని ఫ్యూచర్‌‌‌‌ సిటీలు ఎలా ఉండబోతున్నాయో ఇందులో చూపిస్తున్నాం అన్నాడు. అలాగే ఫ్యూచర్‌‌‌‌ ప్రభాస్‌‌ను ఇందులో చూస్తారని, త్వరలోనే సినిమా, ట్రైలర్‌‌‌‌ రిలీజ్‌‌ డేట్స్‌‌ను అనౌన్స్‌‌ చేస్తామని చెప్పాడు.