
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటు మారుతి డైరెక్ట్ చేస్తున్న సినిమా సెట్స్‌పై ఉంది. వీటి తర్వాత ‘స్పిరిట్’ చిత్రంలో నటించనున్నాడు. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయబోయే ఈ చిత్రం పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని ఇటీవల నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు. ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడట సందీప్. ప్రభాస్ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న సినిమా ఇదే కానుంది. ఈ ఏడాది చివరలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. రెండేళ్ల క్రితం కమిటైన ‘స్పిరిట్’ ఇంకా మొదలవకముందే మరో రెండు సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అందులో ఒక చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాత నవీన్ ఎర్నేని ఇటీవల ఓ టీవీ షోలో చెప్పారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సాలార్’ షూటింగ్‌లో ఉన్న ప్రభాస్.. అతని డైరెక్షన్‌లోనే మరో సినిమా చేయబోతున్నాడు. ఈ పిరియాడికల్ డ్రామాను దిల్ రాజు నిర్మించబోతున్నారు.‘రావణం’ టైటిల్‌తో తెరకెక్కనుందని ఇటీవల దిల్ రాజు చెప్పారు. మొత్తానికి ఇప్పటికే ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉండగా.. ఈ లిస్ట్‌లో మరో రెండు సినిమాలు చేరనున్నాయి.