సాహో రివ్యూ

సాహో రివ్యూ

రివ్యూ: సాహో

రన్ టైమ్: 2 గంటల 50 నిమిషాలు

నటీనటులు: ప్రభాస్,శ్రద్దాకపూర్,నీల్ నితిన్ దేశ్ ముఖ్,అరుణ్ విజయ్,జాకీ ష్రాఫ్,మురళీ శర్మ,చంకీ పాండే,మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్ తదితరులు

సినిమాటోగ్రఫీ:మధి

మ్యూజిక్: బాద్ షా,తనిష్క్ బచ్చి,శంకర్ ఎస్సాన్ లాయ్,గురు రంధవ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జిబ్రాన్

నిర్మాతలు: యువి క్రియేషన్స్

రచన,దర్శకత్వం: సుజిత్

రిలీజ్ డేట్: ఆగస్ట్ 30,2019

కథేంటి?

అశోక్ చక్రవర్తి (ప్రభాస్) క్రైమ్ బ్రాంచ్ పోలీసాఫీసర్.. పెద్ద పెద్ద రాబరీలు చేసే క్రిమినల్ ను పట్టుకోవాలని తన టీమ్ తో కలిసి ఇంటరాగేషన్ చేస్తుంటాడు. ఆ క్రిమినల్.. రాయ్ ఫ్యామిలీ కి చెందిన 2 లక్షల కోట్ల సంపద ను దొంగలించబోతున్నాడని తెలుసుకుంటారు. దాన్ని ఎలా చేధించి ఆ దొంగను పట్టుకుంటారు. అసలు ఈ అశోక చక్రవర్తి బ్యాక్ డ్రౌండ్ ఏంటి? అసలు ప్రభాస్ ట్రైలర్ లో చూపించినట్టు పోలీస్ ఆఫీసరేనా.. కాకపోతే మరేంటి.. సాహోకి.. అశోక చక్రవర్తికి సంబంధం ఏంటి.. సాహో లక్ష్యమేంటి..  అనేదే మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

ప్రభాస్ యాక్షన్ సీన్లల్లో తన కటౌట్ కు తగినట్టు బాగా చేశాడు.కాకపోతే తన లుక్ అస్సలు బాగాలేదు.క్లోజప్ షాట్స్ లో చూడటానికి బాగలేడు.లుక్ పై శ్రద్ద తీసుకోవాల్సింది.శ్రద్దా కపూర్ గ్లామర్ ఒలకబోసింది.యాక్టింగ్ పరంగా ఓకే.నీల్ నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్,మురళీ శర్మ బాగా చేశారు.జాకీ ష్రాఫ్,చంకీ పాండే,మహేష్ మంజ్రేకర్ తమకు అలవాటైన పాత్రల్లో ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ వర్క్:

సినిమా టెక్నికల్ గా హై రేంజ్ లో ఉంది. నిర్మాతలు డబ్బులకు వెనకాడకుండా భారీగా ఖర్చు పెట్టి తీసారు. ప్రతి ఫ్రేము లావిష్ గా ఉంది. మధి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సాంగ్స్ వినసొంపుగా లేవు. జిబ్రాన్ మ్యూజిక్ ఫర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. గ్రాఫిక్స్ పూర్ గా ఉంది. యాక్షన్ సీన్లు హైలైట్. డైలాగులు ఓకే.

విశ్లేషణ:

‘‘సాహో’’ డిజప్పాయింటింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. హై రేంజ్ లో యాక్షన్ సీన్లు,భారీ టెక్నాలజీ, యాక్షన్ సీన్ల మీద పెట్టిన శ్రద్ద కథ, కథనాల మీద పెట్టలేదు. తద్వారా సినిమా చూస్తున్నంత సేపు.. ఏం జరుగుతుందో అర్థం కాకుండా కన్ఫూజన్ లో ఉంటారు ఆడియన్స్.. సీన్ కు సీన్ కు సంబంధం లేని స్క్రీన్ ప్లే, ఎమోషన్ లేని కథ వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ పై అనసవరమైన భారం పెట్టినట్టు అనిపిస్తుంది. ఒకే సినిమా అనుభవమున్న సుజిత్ కు ఇంత లార్జ్ స్కేల్ ఉన్న సినిమా అప్పచెప్పడం వల్ల అతను న్యాయం చేయలేకపోయాడు. పెద్ద సినిమాను డీల్ చేసే అనుభవం కొరవడింది. ఈ సినిమా కథను కూడా ‘‘అజ్ఞాతవాసి’’ లాగా ‘‘లార్గో వించ్’’ అనే ఫ్రెంచ్ సినిమాను కాపీ కొట్టారు. దాన్ని కూడా సరిగా తీయకుండా అస్తవ్యస్తంగా మార్చారు. అందుకే ఈ సినిమా పరమ బోరింగ్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా ‘సాహో’’ పెట్టిన డబ్బులకు న్యాయం చేయదు.