ఆగస్టు నుంచి ప్రభాస్‌ సాలార్‌‌‌‌‌‌‌‌ 2 షూటింగ్‌

ఆగస్టు నుంచి  ప్రభాస్‌ సాలార్‌‌‌‌‌‌‌‌ 2 షూటింగ్‌

‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్‌‌‌‌ను అందుకున్న ప్రభాస్‌‌‌‌.. తన నెక్స్ట్ మూవీ షూటింగ్స్‌‌‌‌పై ఫోకస్ పెడుతున్నాడు. వాటిలో ‘సాలార్‌‌‌‌‌‌‌‌ 2’ కూడా ఒకటి.  శౌర్యాంగపర్వం పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్‌‌‌‌కు వెళుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో సెకెండ్ పార్ట్ షూటింగ్‌‌‌‌కు సంబంధించి ఓ అప్‌‌‌‌డేట్‌‌‌‌ తెరపైకొచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్‌‌‌‌ ఇప్పటికే షూటింగ్ డేట్స్ ఫిక్స్ చేశాడట.  ఆగస్టు 10 నుంచి హైదరాబాద్‌‌‌‌లో ఈ మూవీ షూటింగ్ మొదలవబోతోందని సమాచారం. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్‌‌‌‌ ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ షూట్ టైమ్‌‌‌‌లోనే పార్ట్‌‌‌‌ 2కు సంబంధించి ఇరవై శాతం సీన్స్ చిత్రీకరించారు. ఇక ప్రభాస్‌‌‌‌ హీరోగా మారుతి తీస్తున్న ‘రాజా సాబ్‌‌‌‌’ సెట్స్‌‌‌‌పై ఉండగా, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌‌‌‌లో ‘స్పిరిట్‌‌‌‌’ తెరకెక్కాల్సి ఉంది. అలాగే ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌‌‌‌లోనూ ప్రభాస్ నటించాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌తో ‘డ్రాగన్‌‌‌‌’ అనే సినిమా చేయనున్నాడు ప్రశాంత్ నీల్.