
ప్రభాస్ హీరోగా నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ‘స్పిరిట్’ ఒకటి. ‘యానిమల్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం సెట్స్‌కు వెళ్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
ఈ క్రమంలో జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోకు హాజరైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా గురించి ఓ అప్‌డేట్ ఇచ్చాడు. ‘స్పిరిట్’కు సంబంధించి ఇప్పటికే డెబ్భై శాతం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వర్క్‌ను పూర్తి చేశామని చెప్పాడు. ఆర్ఆర్ ప్లే చేస్తూ షూటింగ్ చేయడం వల్ల సమయం వృథా కాకుండా త్వరగా చిత్రీకరణ జరుగుతుందని, కెమెరా వర్క్‌తో పాటు సీన్‌లో ఎక్కడ కట్ చెప్పాలనేది కూడా ఈజీగా ఉంటుందని వెల్లడించాడు.
‘కబీర్ సింగ్’ టైమ్‌లో ఇది తెలుసుకుని, ఎనభై శాతం బీజీఎంతో ‘యానిమల్’ సెట్స్‌కు వెళ్లామని చెప్పాడు. ప్రభాస్ తానొక పెద్ద స్టార్ అనే భేషజాలు లేకుండా ఉంటారని తనతో వర్క్ చేయనుండటం సంతోషంగా ఉందన్నాడు. అలాగే ‘స్పిరిట్’ డ్యురేషన్ కూడా మూడు గంటలు మించకుండా చూసుకుంటానని తెలిపాడు.
త్వరలో సెట్స్‌కు వెళ్లనున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. త్రిప్తి డిమ్రి హీరోయిన్. హర్షవర్ధన్ రామేశ్వర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.