డార్లింగ్ అంటే తప్పా?.. ఆమె నాకు తల్లితో సమానం

డార్లింగ్ అంటే తప్పా?.. ఆమె నాకు తల్లితో సమానం

టాలీవుడ్ కమెడియన్ ప్రభాస్‌ శ్రీను(Prabhas Sreenu).. సీనియర్ నటి తులసి(Thulasi)తో ఎఫైర్ ఉందని వస్తున్న రూమర్స్ పై స్పందించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్‌ శ్రీను.. ఆ రూమర్లు విని చాలా బాధపడ్డానని తెలిపాడు.  ఆ వార్తల గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడిన ప్రభాస్ శ్రీను.. "తులసితో ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు కానీ.. తమ మీద తప్పుగా రూమర్స్‌ ప్రచారం చేశారంటూ బాధపడ్డాడు.

"తులసి తనకు తల్లితో సమానం అని, 'డార్లింగ్‌(Darling)' సినిమా షూటింగ్‌ సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నామని చెప్పుకొచ్చాడు. ఆవిడ ఒక పెద్ద నటి, ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారు. సినిమా షూటింగ్‌ సమయంలో ఏదో సరదాగా డార్లింగ్‌ అని పిలిచిందని, దానిని కొందరు అపార్థం చేసుకొని ఇలాంటి వార్తలు రాస్తున్నారని తెలిపాడు. తమపై రూమర్స్‌ వస్తున్నట్లు మొదట ఆవిడే  మెసేజ్‌ పెట్టారని, ఈ రూమర్స్‌ గురించి మీ భార్యకు చెప్పు లేదంటే తను కూడా ఆపార్థం చేసుకుంటుందేమో' అని సలహా కూడా ఇచ్చిందని చెప్పిన ప్రభాస్ శ్రీను.. తన భార్య ఒక  డాక్టర్‌ అని, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఇలాంటి రూమర్స్‌ నమ్మదంటూ చెప్పాడు.

ప్రస్తుతం ప్రభాస్ శ్రీను చేసిన ఈ వ్యాఖలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.