Kalki 2898 AD: కల్కి ఇపుడు రూ.100కే.. 'పాకెట్ ప‌ర్స్ ఫ్రెండ్లీ టికెట్..మేకర్స్ బంపర్ ఆఫర్

Kalki 2898 AD: కల్కి ఇపుడు రూ.100కే.. 'పాకెట్ ప‌ర్స్ ఫ్రెండ్లీ టికెట్..మేకర్స్ బంపర్ ఆఫర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD.దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు.భారీ అంచనాల మధ్య జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించింది.ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా రూ.1100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన కల్కి సినిమాను ఆడియన్స్ కు మరింత చేరువ చేసేలా వైజయంతి మూవీస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చింది. 

ప్రస్తుతం కల్కి మూవీ థియేటర్లలో ఆరవ వారంలోకి ప్రవేశించడంతో మేకర్స్ 'పాకెట్ ప‌ర్స్ ఫ్రెండ్లీ టికెట్' అంటూ బంఫర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. ఇవాళ ఆగస్ట్ 2 నుండి ఆగస్టు 9 వరకు 'కల్కి 2898 AD' టిక్కెట్లు కేవలం రూ.100కే భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో రూ.100కే (పన్నులు మినహాయించి) అందుబాటులోకి వ‌చ్చింది.

ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.100 ఉండగా..మల్టీప్లెక్స్ లో రూ.112 లకు అందుబాటులో ఉన్నది. వారం రోజుల పాటు ఇదే టికెట్ రేటు కొన‌సాగ‌నుంది. మరికొన్ని థియేటర్స్లో మాత్రం ఈ రేటు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే ఈ మహాభారత ఎపిక్ ను థియేటర్స్ విజువల్స్ లో మరింత మంది ఎంజాయ్ చేసేలా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చూడని వారుంటే కుటుంబంతో సహా వెళ్లి కల్కి విజువల్స్ ని దర్శించండి. 

గతంలో వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లు కలెక్షన్లు రాబట్టిన చిత్రాలు చూసుకుంటే..బాలీవుడ్ స్టార్ హీరోగా అమిర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ దంగల్.ఈ మూవీ రూ.2024 కోట్లు సాధించగా..ప్రభాస్ బాహుబలి-2 రూ.1810.60 కోట్లు,ఎన్టీఆర్,చరణ్ RRR రూ.1387.26కోట్లు,యష్,ప్రశాంత్ నీల్ KGF రూ.1250 కోట్లు,షారుక్ ఖాన్ పఠాన్ మూవీ రూ.1050కోట్లు,కాగా జవాన్ రూ.1148.32కోట్ల కలెక్షన్లు సాధించాయి.