
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే (2025 అక్టోబర్23న) అంటే.. ఫ్యాన్స్కు "బిగ్గెస్ట్ సెలెబ్రేషన్స్" అని చెప్పాలి. తమ హీరో పుట్టినరోజుని అసలైన పండుగలా జరుపుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. ‘‘ఇండియన్ సినిమా రాజాసాబ్..’’ అంటూ క్రేజీ వైబ్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఓవైపు ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ అప్డేట్స్, మరోవైపు డార్లింగ్ త్రోబ్యాక్ వీడియోస్ తెగ ఖుషి చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రభాస్ కు బర్త్ డే విషెష్ చెబుతూ రాజాసాబ్ మేకర్స్ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్ లో కనువిందు చేస్తున్నారు. రంగురంగులగా అలంకరించిన పండుగలాంటి ఓ వేడుకలో ప్రభాస్ దర్శనం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తన అభిమాన రాజాసాబ్ని స్వాగతిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
‘‘రెబల్ స్టైల్, రెబల్ స్వాగ్.. ప్రతిదీ వెలిగించే రెబల్ మ్యాడ్నెస్: మీరు తీసుకువచ్చే గొప్పతనానికి, వేడుకకు ఏదీ సాటిరాదు.. ది రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ ప్రతి అభిమానికి అపరిమితమైన వేడుకగా ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు.
There’s style.
— The RajaSaab (@rajasaabmovie) October 23, 2025
There’s swagger
and there’s that Rebel Madness that lights up everything 🔥
Nothing can ever match the high and celebration you bring 🙏🏻#TheRajaSaab First Single will be a limitless wave of celebration for every fan 💯 #Prabhas #TheRajaSaabOnJan9th… pic.twitter.com/AoKDiu7RSL
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ విజువల్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో త్వరలో రానున్న ఫస్ట్ సింగిల్తో మూవీపై మరింత క్యూరియాసిటీ పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే.. ఈ క్రేజీ హార్రర్ కామెడీ మూవీలో ప్రభాస్కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.