V6 News

Prabhas : 'ది రాజా సాబ్' దూకుడు.. నెల రోజులకు ముందే ఓవర్సీస్ ప్రీమియర్స్ హౌస్‌ఫుల్ !

Prabhas : 'ది రాజా సాబ్' దూకుడు.. నెల రోజులకు ముందే ఓవర్సీస్ ప్రీమియర్స్ హౌస్‌ఫుల్ !

రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు సిద్ధమవుతోంది. ఈ రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ.. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ అసాధారణమైన హైప్‌ను క్రియేట్ చేస్తోంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆల్ టైమ్ రికార్డ్!

‘ది రాజా సాబ్’ సినిమా విడుదలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది . అయితే నార్త్ అమెరికా (USA) మార్కెట్‌లో  ఈ మూవీ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ట్రేడ్ పండితులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రీ-సేల్స్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఈ చిత్రం లక్ష డాలర్ల మార్క్‌ను దాటి దూసుకుపోతోంది.  ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం యూఎస్‌ఏలోని 283 లొకేషన్లలో, 855 షోల ద్వారా 3447 టికెట్లు అమ్ముడయ్యాయి.

 నార్త్ అమెరికా వ్యాప్తంగా ఈ అడ్వాన్స్ సేల్స్  లక్ష 3వేల డాలర్లకు చేరింది. విడుదల తేదీకి ఇంకా 27 రోజులు ఉన్నప్పటికీ ఈ స్థాయి బుకింగ్స్ జరగడం, ప్రభాస్ ఓవర్సీస్ క్రేజ్ ఎంత బలంగా ఉందో స్పష్టం చేస్తోంది ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 'సలార్' , 'కల్కి 2898 AD' వంటి భారీ విజయాల తర్వాత  సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ గా వస్తున్న  ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 8న జరిగే ప్రీమియర్స్ కోసం ప్రీమియం సీట్స్ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

 

 రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో..

'ది రాజా సాబ్' చిత్రం రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఫ్యాన్స్ అంచనాలను అమాంతం పెంచేసింది. మారుతి స్వయంగా అందించిన వాయిస్ ఓవర్‌తో, టీజర్‌లో కనిపించిన భయానక విజువల్స్, గ్రాండ్ సెట్స్, ప్రభాస్ ఇంటెన్స్ లుక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ అందించిన మొదటి పాట ‘రెబల్ సాబ్’ ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌ను సాధించి, అభిమానుల్లో మంచి జోష్ నింపింది. త్వరలోనే విడుదల కానున్న రెండో సింగిల్, 'సాహస సాహస' ఒక పక్కా హిట్ పాటగా నిలుస్తుందని థమన్ టీజ్ చేశారు. ఈ పాటలు సినిమాపై హైప్‌ను మరింత పెంచడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి పండుగకు థియేటర్లలో సందడి చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.