TheRajaSaab: జూన్ 6న రాజాసాబ్ టీజర్.. ఇది కూడా డిలే అయిందో.. ఉన్న బజ్ పోయినట్టే!

TheRajaSaab: జూన్ 6న రాజాసాబ్ టీజర్.. ఇది కూడా డిలే అయిందో.. ఉన్న బజ్ పోయినట్టే!

డార్లింగ్ హీరో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్. 2025 ఏప్రిల్లో రిలీజ్ అవుతుందన్న చిత్రం, రిలీజ్ కాకపోవడంతో ఆ సినిమా గురించి మళ్లీ పెద్దగా డిస్కషన్ జరగలేదు. రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం.. అన్న ధోరణిలో అభిమానులంతా సైలెంట్ అయిపోయారు.

లేటెస్ట్గా 'రాజాసాబ్' నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా టీజర్ జూన్ 6న రిలీజ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో టీజర్ ఎలా ఉండబోతుంది? అన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రభాస్ లుక్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ క్రమంలో రిలీజ్ కాబోయే టీజర్పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రభాస్ తన కెరియర్లో ఫస్ట్ టైం హార్రర్ జోనర్లో సినిమా చేస్తుండటం మరింత క్యూరియాసిటీ తీసుకొచ్చింది.

ఇక మొదట మారుతి పోస్టర్స్, టీజర్ కంటెంట్తోనే బజ్ క్రియేట్ చేశాడు. కానీ సినిమా డిలే అయ్యే సరికి, ఆ బజ్ కూడా తగ్గిపోతుంది. చూడాలి మరి టీజర్ ఎలాంటి వైబ్ అందిస్తుందో!

►ALSO READ | సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన నిర్మాత AM రత్నం.. వీరమల్లుకి ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచనుందా!

ఇకపోతే, ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిరి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, రిద్దీకుమార్, యోగి బాబు, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. 2025 డిసెంబర్ 5న రాజాసాబ్ థియేటర్లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి.