బాలయ్య అన్ స్టాపబుల్- 2లో ప్రభాస్, గోపిచంద్ సందడి

బాలయ్య అన్ స్టాపబుల్- 2లో ప్రభాస్, గోపిచంద్ సందడి

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్- 2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో బాలయ్య చెప్పే కబుర్లు, ఆటలు ఫోకు మరింత క్రేజ్ పెంచేశాయి. తాజాగా ఈ షోకి రెబల్ స్టార్ ప్రభాస్.. తన స్నేహితుడు గోపిచంద్‭‭తో కలిసి వచ్చారు. వర్షం సినిమా వచ్చినప్పటి నుంచి ప్రభాస్, గోపిచంద్‭లు మంచి స్నేహితులు అయ్యారు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి బాలయ్య అన్ స్టాపబుల్ షోలో సందడి చేయనున్నారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తైనట్లు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ప్రకటించింది.      

                                                      

బాలయ్య, ప్రభాస్, గోపీచంద్ చిత్రీకరణలో పాల్గొన్న ఫొటోలను ట్విట్టర్‭లో షేర్ చేసింది. ప్రభాస్, బాలయ్య ఒకే స్టేజ్, ఫ్రేమ్ లోకి వచ్చిన విషయాన్ని తాము ఇంకా నమ్మలేకపోతున్నామని ట్వీట్ చేసింది. ‘మీరు ఎన్నడూ చూడని ఒక కొత్త యాంగిల్ మీకు చూపించే మాసివ్ ఎపిసోడ్ ఇది. త్వరలో మీ ముందుకు వస్తుంది అని ఆహా పేర్కొంది. ఇప్పటికే వీరికి సంబంధించిన చిన్న వీడియోతో పాటు.. ఫోటోలను చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. దీంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.