మహా శివుడిగా ప్రభాస్.. కన్నప్పపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు

మహా శివుడిగా ప్రభాస్.. కన్నప్పపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) మహా శివుడిగా కనిపించనున్నాడా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా హీరో మంచి విష్ణు(Manchu Vishnu) చేసిన ట్వీట్ చూస్తుంటే అది క్లియర్ గా అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించే చర్చ నడుస్తోంది. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మంచి విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే శ్రీ కాళహస్తిలో ప్రత్యేక పూజలతో లాంఛనంగా ప్రారంభమైంది ఈ సినిమా. దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. 

ఇక తాజా సంచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రభాస్ మహా శివుడి పాత్రలో కనిపించనున్నాడట. దీనికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చాడు హీరో మంచు విష్ణు. తాజాగా రమేష్ బాల కన్నప్ప సినిమాలో మహా శివుడిగా ప్రభాస్ కనిపించనున్నాడని అని తన ట్విట్టర్ లో పెట్టారు. దానికి రిప్లై ఇస్తూ మంచు విష్ణు హర హర మహాదేవ్ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ సినిమాలో ప్రభాస్ యాక్ట్ చేయనున్నాడు అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.