షూటింగ్ శరవేగంగా.. ఫారిన్‌‌లో రాజా సాబ్

షూటింగ్ శరవేగంగా.. ఫారిన్‌‌లో రాజా సాబ్

ప్రభాస్‌‌ హీరోగా మారుతి రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’.  ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  నెక్స్ట్ షెడ్యూల్‌‌ను ఫారిన్‌‌లో చిత్రీకరిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే దర్శకుడు మారుతి, కో ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్న ఎస్‌‌కేఎన్ యూరప్ చేరుకున్నారు. అక్కడ అందమైన లొకేషన్స్‌‌లో  రెండు పాటలను పిక్చరైజ్ చేయనున్నట్టు తెలియజేశారు. ప్రభాస్‌‌తో పాటు హీరోయిన్స్‌‌గా నటిస్తున్న మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా ఈ షెడ్యూల్‌‌లో జాయిన్ అవుతున్నారు.

ఈ షెడ్యూల్‌‌తో దాదాపు షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బొమాన్ ఇరానీ సహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని   పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.   సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా  విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.