ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ లోని శ్రీ వీరాంజనేయ శివసాయి సమాజ్ ఆలయ కమిటీ కొత్త అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన కె.ప్రదీప్ కుమార్ ఎన్నికయ్యారు. గురువారం స్థానిక ఆలయంలో నూతన కమిటీ సమావేశం నిర్వహించారు.
హాజరైన సాయి భక్తులు, పుర ప్రముఖులు ప్రదీప్ ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు చిన్నం సత్యం, అంకం రాజేందర్, ఆత్మ చైర్మన్ తోట సత్యం, నాయకులు తోట సుమిత్, రాజ గంగన్న, శ్రీనివాస్, కిశోర్, రాజేందర్ గౌడ్, సురేశ్, దివాకర్, రాకేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
