మహిళలకు అదిరిపోయే స్కీమ్.. గ్యాస్​ సిలండర్స్​ ఉచితం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

మహిళలకు అదిరిపోయే స్కీమ్.. గ్యాస్​ సిలండర్స్​ ఉచితం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

మహిళలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన  స్కీమ్‌ కింద  గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడంతోపాటు గ్యాస్ స్టవ్‌ను కేంద్రం ఫ్రీగా ఇస్తోంది. ఈ స్కీమ్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను ఎలా పొందాలి..? ఆన్‌లైన్‌ ఎలా అప్లై చేసుకోవాలి..? ఏయే డాక్యుమెంట్స్ కావాలి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం. . .

ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు గ్యాస్ కనెక్షన్లతో పాటు ఉచితంగా సిలిండర్లు అందజేస్తారు.  సిలిండర్‌తో పాటు గ్యాస్‌ స్టవ్‌ కూడా ఉచితంగా లభిస్తుంది.మహిళలు మాత్రమే ఉచిత సిలిండర్ పథకం ప్రయోజనం పొందుతారు.   ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలంటే ముందుకు ఏజెన్సీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం ఆ డబ్బును మీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. 

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అనేక రకాల పథకాలు అమలు చేస్తోంది. వీటిలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కూడా ఉంది.  ఈ పథకం ద్వారా   ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందజేస్తుంది. ఇప్పటి వరకు ఉజ్వల పథకం కింద 10 కోట్ల మందికి పైగా మహిళలకు ప్రభుత్వం ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లను అందజేస్తోంది. అర్హులైన వారు  అధికారిక వెబ్‌సైట్ https://www.pmuy.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 
పథకానికి ఎవరు అర్హులంటే... 

  •  ఉచిత సిలిండర్ కోసం దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి 
  • దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లు పైబడి ఉండాలి
  • కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్ష, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
  • ఈ పథకం పేరుతో లబ్ది పొందిన మహిళ ఇప్పటికే ఎలాంటి LPG కనెక్షన్‌ను కలిగి ఉండకూడదు.
  • లబ్ధిదారుడు బిపిఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి.
  • లబ్ధి పొందిన మహిళ దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి.
  • మహిళలు మూడు ఏజెన్సీ ఎంపికల ద్వారా గ్యాస్ ఏజెన్సీని ఎంచుకోవచ్చు: భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్.
  • ఈ పథకం ద్వారా, లబ్ధిదారుడు ఎంచుకున్న గ్యాస్ ఏజెన్సీ ద్వారా గ్యాస్ సిలిండర్‌ను పొందుతాడు.

ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి..

  • కుల ధృవీకరణ పత్రం
  • ఆదాయ ధృవీకరణ పత్రం 
  •  ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు లేదా బీపీఎల్​ కార్డు 
  •  పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  •  మొబైల్ నంబర్
  • బ్యాంక్ అకౌంట్
  • చిరునామా రుజువు
     

ఎలా దరఖాస్తు చేయాలి

  •  ముందుగా అధికారిక www.pmuy.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  • “ఉజ్వల యోజన 2.0 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్” ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  •  మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. మొబైల్ నంబర్, ఓటీపీ సహాయంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
  •  మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ నంబర్‌ను కరెక్ట్‌గా ఎంటర్ చేయండి.
  •  అప్లికేషన్ ఫారం  ఆన్​ లైన్​ లో పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన పూర్తి సమాచారాన్ని అందించాలి.
  •  ఫారమ్‌తో పాటు మీ అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  •  దరఖాస్తును సబ్మిట్ చేసి.. ప్రింట్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  • తర్వాత  గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి ఫారమ్‌ను సమర్పించండి