ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ చిత్రంతో త్వరలో హిందీ ప్రేక్షకుల ముందుకొస్తోంది ప్రగ్యా. ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తాప్సీ, వాణీ కపూర్, అమి విర్క్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు అటు అక్షయ్, ఇటు బాలకృష్ణ చిత్రాల్లో ఒకే సమయంలో నటించడంపై ఆమె మాట్లాడుతూ ‘‘ఒకేసారి రెండు వేర్వేరు భాషలు, వేర్వేరు ఇండస్ట్రీస్‌లో వర్క్ చేయడం గర్వంగా ఉంది.
మంచి సినిమాల్లో భాగమవడం, గుర్తుండిపోయే పాత్రల్లో నటించేందుకు ట్రై చేస్తుంటాను. అలాంటి ఓ మంచి అవకాశం వచ్చినప్పుడు భాషతో సంబంధం లేకుండా అందులో నటిస్తాను’’ అని చెప్పింది. అలాగే తనపై వచ్చే బ్యాడ్ రూమర్స్ గురించి ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ.. నా గురించి బ్యాడ్ రూమర్స్ నేనెప్పుడూ వినలేదు. ఎప్పుడూ గుడ్ రూమర్సే వస్తుంటాయి. అవన్నీ నాకు అనుకూలమైనవి, నిజాలే కనుక ఇబ్బంది పడలేదన్నట్టుగా చెప్పింది. బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందనున్న ‘అఖండ 2’లోనూ ఆమె హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమా చారం.