మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌‌‌‌‌‌‌‌

మరోసారి బాలయ్యకు జోడీగా ప్రగ్యా  జైస్వాల్‌‌‌‌‌‌‌‌

హిట్ జోడీలకు సినిమా ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందుకే కొందరు మేకర్స్.. ఆ పెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిపీట్ చేస్తుంటారు. తాజాగా మరో సూపర్ హిట్ కాంబో రాబోతుందని తెలుస్తోంది. ‘అఖండ’ చిత్రంలో బాలకృష్ణకు జంటగా నటించి సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది ప్రగ్యా జైస్వాల్. తాజాగా మరోసారి బాలయ్యకు జోడీగా కనిపించేందుకు సిద్ధమవుతోందట ప్రగ్యా. ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో బాలకృష్ణ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది.

ఇందులో ఫిమేల్ లీడ్‌‌‌‌‌‌‌‌గా ఊర్వశి రౌటేలా నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే మరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యత ఉండటంతో ప్రగ్యా  జైస్వాల్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆమె కూడా ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో  ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. 

కొన్ని కీల‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌మైన‌‌‌‌‌‌‌‌ యాక్షన్ స‌‌‌‌‌‌‌‌న్నివేశాల‌‌‌‌‌‌‌‌ను అక్కడ చిత్రీక‌‌‌‌‌‌‌‌రిస్తున్నారు. 50 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఇందులో విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.