మంచిర్యాలలో బైక్ యాత్రను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

మంచిర్యాలలో బైక్ యాత్రను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అమిత్ షా ఆదేశాలతో ప్రజా గోస - బీజేపీ భరోసా బైక్ యాత్రను చేపట్టామని  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి  తెలిపారు. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని లక్షేట్టిపేట మండలం గుల్లకోట గ్రామంలో బీజేపీ జెండా ఏగరేసి భైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.  ఈ  సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... మొదటి విడత ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ యాత్ర విజయవంతం అయిందన్నారు.

బీజేపీ బైక్ యాత్రలు విజయవంతం కావడంతో కేసీఆర్ కు భయం పట్టుకుందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. గ్రామగ్రామాన బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. గుల్లకోటలో మొదలైన ఈ యాత్ర కొత్తూరు వరకు కొనసాగనుంది.  బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడం, కేంద్ర పథకాలు, సీఎం కేసీఆర్ నెరవేర్చని హామీలపై ప్రజలకు వివరించడమే లక్ష్యంగా కమలం పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.