
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చేపట్టిన ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 14వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒకట్రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. మెదక్, దుబ్బాక, ఆందోల్, జహీరాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, షాద్ నగర్, చేవెళ్ల, పరిగి, నల్గొండ సూర్యపేట, తుంగతుర్తి, పరకాల, వర్థన్నపేట, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 బైక్ లతో ర్యాలీ నిర్వహించనున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి. నిత్యం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించి స్థానిక సమస్యల గురించి నేతలు తెలుసుకోనున్నారు.