
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జీవితం ఆధారంగా ప్రభాకర్ జైనీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు. కాళోజీ పాత్రను మూలవిరాట్ పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ ‘కాళోజీ ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నమిది. షూటింగ్ టైమ్‌లో మూలవిరాట్‌ను చూసి కాళోజీ గారు వచ్చినట్లు ఉందని చాలా మంది చెప్పారు.
ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని చెప్పారు. ‘కాళోజి పాత్ర చేశాక నా జీవితానికి సార్థకత లభించిందనే భావన కలుగుతోంది’ అని మూల విరాట్ అన్నారు. కాళోజీ నివసించిన ఇంట్లో, తిరిగిన రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేశామని నిర్మాత చెప్పారు. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయి వెంకట్, సంగీత దర్శకుడు శ్రీధర్ పాల్గొన్నారు.