దేవుడి పేరుతో ప్రజాపాలన దరఖాస్తు..ఎక్కడంటే.?

దేవుడి పేరుతో ప్రజాపాలన దరఖాస్తు..ఎక్కడంటే.?

ప్రజాపాలనలో దేవుడి పేరుతో దరఖాస్తు చేసిన ఘటన హన్మకండ జిల్లాల్లో చోటుచేసుకుంది. భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో శివుడి పేరుతో అభయహస్తంకు అప్లై చేశారు ఏనుగు వెంకట సురేందర్ రెడ్డి. దరఖాస్తుదారుడి పేరు శివుడిగా, భార్య పేరు పార్వతి దేవిగా, కుమారుల పేర్లు కుమారస్వామి, వినాయకుడిగా రాశాడు. గృహలక్ష్మి, గృహజ్యోతితోపాటు ఇతర పథకాలకు అప్లై చేశారు. దేవుడు పేరుతో ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం గ్రామస్తులను ఆశ్చర్యపరిచింది.  

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలకు కోసం  డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు  దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల డాటాను ప్రభుత్వం జనవరి 17న ఆన్ లైన్ లో ఎంట్రీ చేయనుంది