మందకృష్ణ అమ్ముడుపోయారు:కేఏ పాల్

మందకృష్ణ అమ్ముడుపోయారు:కేఏ పాల్
  • మా పార్టీలోకి రమ్మంటే 
  • 25 కోట్లు అడిగిండు: కేఏ పాల్ 

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీకి మందకృష్ణ మాదిగ అమ్ముడుపోయారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ ఆరోపించారు. మాదిగలకు ఇన్నాళ్లూ ఏమీ చేయని మోదీ.. ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు.  ప్రజాశాంతి పార్టీకి సింబల్​ కేటాయింపు విషయంపై సీఈఓ వికాస్​ రాజ్​ను ఆయన సోమవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఒకప్పుడు మోదీని ఘోరంగా తిట్టిన మందకృష్ణ.. ఇప్పుడు దేవుడని అంటున్నారన్నారు. ఎంపీ సీటుకు అమ్ముడుపోయారని, తమ పార్టీలోకి ఆహ్వానించినప్పుడు రూ.25 కోట్లు అడిగారని ఆరోపించారు.