గడప గడపకు సర్పంచ్.. వికారాబాద్ జిల్లా కోల్కొంద లో ప్రజల సమస్యలు తెలుసుకున్న సర్పంచ్
వికారాబాద్, వెలుగు: మోమిన్‌పేట మండలంలోని కోల్కొంద గ్రామ సర్పంచ్ కరుణం కీర్తి రామక్రిష్ణ ఆదివారం గ్రామంలోని ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నెలలో మూడు రోజుల పాటు గ్రామంలో ఇంటింటికీ స్వయంగా తిరిగి సమస్యలను తెలుసుకుని వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
