రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు రెండో ఓటమి

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు రెండో ఓటమి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రెండో ఓటమిని మూటగట్టుకుంది.  ఆదివారం ముగిసిన ఎలైట్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–డి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 9 వికెట్ల తేడాతో ముంబై చేతిలో ఓడింది. మరోవైపు ఆరు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 30 పాయింట్లు సాధించిన ముంబై క్వార్టర్స్ చేరుకుంది. చివరి రోజు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నిర్దేశించిన 10 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌ను ముంబై 3.2 ఓవర్లలో ఓ వికెట్ కోల్పోయి ఛేజ్ చేసింది.

 అంతకుముందు 166/7 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌  కొనసాగించిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 69.5 ఓవర్లలో 302 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. సీవీ మిలింద్‌‌‌‌‌‌‌‌ (85), నితిన్‌‌‌‌‌‌‌‌ సాయి యాదవ్‌‌‌‌‌‌‌‌ (32), కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌ (32) పోరాడారు. ఈ ముగ్గురు కలిసి 132 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేయడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఓటమి నుంచి బయటపడింది. ముషీర్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ 5  వికెట్లు తీశాడు. సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. గురువారం మొదలయ్యే చివరి లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌.. ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది.