న్యూఢిల్లీ: ఇండియాలో విమానాల తయారీ మొదలుకానుంది. అదానీ గ్రూప్, బ్రెజిల్‌కు చెందిన ఎంబ్రాయర్ కంపెనీ భారత్‌లో కమర్షియల్ విమానాల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ (ఎఫ్‌ఏఎల్)ను ఏర్పాటు చేయనున్నాయి. దీనికి సంబంధించి జనవరి 27న ఎంఓయూ కుదుర్చుకోనున్నాయి.
ఎంబ్రాయర్ 150 సీట్లు వరకు ఉన్న కమర్షియల్ విమానాలను తయారు చేస్తోంది. ఈ ఎఫ్‌ఏఎల్ ద్వారా అదానీ గ్రూప్ విమానాల తయారీలోకి అడుగుపెడుతోంది. భవిష్యత్తులో విమాన భాగాల తయారీ కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
ఎంబ్రాయర్ ఇప్పటికే భారత్‌లో 50 విమానాలను ఆపరేట్ చేస్తోంది. వచ్చే 20 ఏళ్లలో 80–146 సీట్ల పరిధిలో కనీసం 500 విమానాల అవసరం ఉంటుందని అంచనా.
