సూర్యాపేట, వెలుగు: కాంగ్రెస్ ముస్లింల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, మైనారిటీలకు పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని,ఈ అభివృద్ధినే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మైనార్టీలంతా ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా 34 వ వార్డులోని మాజీ కౌన్సిలర్ యూసఫ్ తో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి,రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ ల సమక్షంలో పట్టణ అధ్యక్షుడు అంజాద్ అలీ ఆధ్వర్యంలో చేరారు. వారికి సర్వోత్తమ్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు గౌస్, సాజిద్ నీడ్స్, ఖాజా యూసుఫుద్దీన్, ఖమ్రుద్దీన్,తదితరులు పాల్గొన్నారు.
