పదో తరగతి విద్యార్థుల కోసం.. శ్రీరామ్ లైఫ్ నుంచి స్కాలర్షిప్స్

పదో తరగతి విద్యార్థుల కోసం.. శ్రీరామ్ లైఫ్ నుంచి స్కాలర్షిప్స్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థుల కోసం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌ సంస్థ రూ.2.2 కోట్ల విలువైన ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన ‘చదువుకో తెలంగాణ’ ప్రచార కార్యక్రమాన్ని   ఆవిష్కరించింది. 

రాష్ట్ర స్థాయి టాపర్‌‌‌‌కు రూ.5 లక్షలు, జిల్లా టాపర్‌‌‌‌కు రూ.2 లక్షలు, నియోజకవర్గ టాపర్‌‌‌‌కు రూ.లక్ష, మండల టాపర్‌‌‌‌కు రూ.10 వేల నగదు బహుమతి ఇస్తారు. ఆరు వేల పాఠశాలల నుంచి సుమారు 3.3 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనే 
అవకాశం ఉంది.