ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో నయనశ్రీకి మరో గోల్డ్..

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో  నయనశ్రీకి మరో గోల్డ్..

హైదరాబాద్, వెలుగు:  ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో  తెలంగాణ స్కేటర్ తాళ్లూరి నయనశ్రీ రెండో  గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌తో సత్తా చాటింది. లేహ్ లో ఆదివారం జరిగిన విమెన్స్ 1000 మీటర్ల షార్ట్ ట్రాక్ స్కేటింగ్‌‌‌‌‌‌‌‌లో నయనశ్రీ టాప్ ప్లేస్ సాధించింది.  

1:43.32 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం గెలుచుకుంది. దాంతో ఈ  గేమ్స్‌‌‌‌‌‌‌‌లో  రెండు వ్యక్తిగత స్వర్ణాలు నెగ్గిన మూడో అథ్లెట్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. మరోవైపు మెన్స్‌‌‌‌‌‌‌‌ 1000 మీటర్ల షార్ట్ ట్రాక్ విభాగంలో తెలంగాణ స్కేటర్లు విష్ణు వర్దన్ (1:40.72 సె) రజతం , శివ మణికం (1:44.19 సె) కాంస్యం అందుకున్నారు.