చెన్నై: తమిళనాడులో హిందీకి చోటు లేదని డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఆదివారం తమిళ భాషా అమరు వీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు ఆయన మాట్లాడుతూ.. భాషను ప్రాణంలా ప్రేమించే తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా పోరాటాలు చేశామన్నారు. హిందీకి శాశ్వతంగా తమ రాష్ట్రంలో చోటు లేదన్నారు. 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన ఓ వీడియోను ఆయన చూపించారు.
