తెలంగాణకు సీఎస్ శని తొలగిపోయింది: కేఏ పాల్ 

తెలంగాణకు సీఎస్ శని తొలగిపోయింది: కేఏ పాల్ 

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్‌గా సోమేశ్‌ కుమార్‌ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ స్పందించారు. రాష్ట్రానికి సీఎస్ శని తొలగిపోయిందని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి రైతుల తరపున తాను పోరాడుతానని చెప్పారు. రాష్ట్రంలోని రైతులందరికీ న్యాయం జరగాలన్నారు. 

కామారెడ్డి రైతుల కేసు విషయంలో పార్టీ ఇన్ పర్సన్ గా పిటిషన్ వేశామని కేఏ పాల్ చెప్పారు. రేపు తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపిస్తానని తెలిపారు. కామారెడ్డి రైతులకు న్యాయం జరిగేంత వరకూ పోరాడుతానని చెప్పారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ‘తప్పకుండా న్యాయం గెలుస్తుంది. రైతులు ఆందోళన చెందవద్దు’ అని పిలుపునిచ్చారు. 

సీఎం కేసీఆర్తో సోమేష్ కుమార్ భేటీ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్తో  భేటీ అయ్యారు. సోమేష్ కుమార్ను ఏపీ కేడర్ కు వెళ్లాలంటూ కోర్టు ఉత్తర్వులుజారీ చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టు తీర్పును సోమేష్ కుమార్ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారా..? లేదా..? అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

రాష్ట్ర విభజన సమయంలో ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా డీఓపీటీ రెండు రాష్ట్రాలకు కేటాయించింది. సోమేష్ కుమార్ కు ఏపీ కేడర్ అలాట్ చేసింది. అయితే తాను తెలంగాణకు వెళ్తానని సోమేష్ కుమార్ చెప్పారు. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన క్యాట్.. సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగేందుకు అనుమతించింది. 2017లో కేంద్రం క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమేష్ కుమార్ ను ఏపీ కేడర్కు వెళ్లాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది.