ఇవాళ కాంగ్రెస్​లోకి ప్రకాశ్ గౌడ్

ఇవాళ కాంగ్రెస్​లోకి ప్రకాశ్ గౌడ్
  • సీఎం రేవంత్​ సమక్షంలో పార్టీలో చేరనున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే
  • ఆయనతోపాటు మరికొందరు మున్సిపల్​ చైర్మన్లు, కార్పొరేటర్లు

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరనున్నారు. ఆయనతో పాటు హైదరాబాద్​ శివారులోని పలు మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొ రేటర్లు, ఎంపీపీలు కూడా చేరను న్నట్లు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ప్రకాశ్ గౌడ్  ఒకసారి సీఎంను కలిశారు. అప్పట్లోనే ఆయన బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జరిగినా చివరకు శుక్ర వారం ముహూర్తం ఖరారైంది.