ఉదయనిధి కామెంట్స్​పై రాహుల్ గాంధీ స్పందించాలి: ప్రకాశ్ జావడేకర్​

ఉదయనిధి కామెంట్స్​పై రాహుల్ గాంధీ స్పందించాలి: ప్రకాశ్ జావడేకర్​

తమిళనాడు సీఎం స్టాలిన్​ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్​ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల వివాదం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీ ప్రకాశ్​జావడేకర్​ ఈ వివాదంపై స్పందించారు. 

ఇండియా కూటమిలో ఉన్న నేతల్లో ఒకరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆ కూటమి అగ్రనాయకుడిగా ఉన్న  కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఈ వివాదంపై స్పందించాలని డిమాండ్​ చేశారు. 

Also Read : డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీలో ఉద్రిక్తత.. నిరసనకారులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం

దేశ ప్రజలంతా ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తమ కూటమి నేత అన్న మాటలపై స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. 

ఉదయనిధి అన్ని ధర్మాలను అవమానించారని విమర్శించారు. మంత్రిగా ఉన్న ఆయన తన హుందాతనాన్ని కాపాడుకోవాలని సూచించారు. 

భారత్ ​పేరుపై వివరణ

ఈ సందర్భంగా ప్రకాశ్​ జవడేకర్​ఇండియా పేరును భారత్ గా మార్చడంపై స్పందించారు. భారత్​ అనే పేరు గతంలో నుంచే ఉందని, కలకత్తా కోల్​కత్తాగా, చెన్నై మద్రాస్​గా మారినప్పుడు భారత్ పేరు మారితే తప్పేముందని ప్రశ్నించారు.  చిన్నతనం నుంచే భారత్​మాతా కీ జై అంటున్నట్లు గుర్తు చేశారు.