ప్రకాశ్ నగర్ చెక్ డ్యామ్ ఎత్తు తగ్గింపు పనులు షురూ

ప్రకాశ్ నగర్ చెక్ డ్యామ్ ఎత్తు తగ్గింపు పనులు షురూ

ఖమ్మం ఫొటోగ్రాఫర్ వెలుగు : ఖమ్మం నగరంలో వరదలకు కారణమైన ప్రకాశ్ నగర్ చెక్ డ్యామ్ ను ఎట్టకేలకు అధికారులు ఎత్తు తగ్గిస్తున్నారు. 2022లో దాదాపు 10 ఫీట్ల ఎత్తుతో దీన్ని నిర్మించగా, ఆ తర్వాత వరుసగా రెండేండ్ల పాటు వరద ప్రవాహంతో ఖమ్మం నగరంతో పాటు మున్నేరును ఆనుకొని రూరల్ మండలంలోని 40కి పైగా కాలనీలు నీట మునిగాయి. బీఆర్ఎస్ హయాంలో దాదాపు రూ.8.5 కోట్లు ఖర్చు చేసి దీన్ని నిర్మించగా, ఈ చెక్ డ్యామ్ వల్లే 70 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా వరద తమ కాలనీల్లోకి వస్తుందంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. 

ఇరిగేషన్ అధికారులు కూడా దీన్ని తొలగించాలని రిపోర్ట్ ఇవ్వడంతో కలెక్టర్ అనుదీప్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులతో ఎత్తు తగ్గింపు పనులు మొదలుపెట్టారు. 'డైమండ్ వైర్సా కటింగ్' విధానంలో మూడ్రోజుల్లో 5 ఫీట్ల మేర ఎత్తు తగ్గించాలని నిర్ణయించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.