ప్రాణాయామంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది: మోడీ

ప్రాణాయామంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది: మోడీ
  • యోగాతో కరోనాను తరిమేయొచ్చు

న్యూఢిల్లీ: నిత్యం ప్రాణాయామం చేస్తే మనలో ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్రధాని మోడీ నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం ఇంటర్నేషనల్‌ యోగా డేను పురస్కరించుకుని వీడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యోగాతో కరోనాను తరిమికొట్టొచ్చని అన్నారు. “ కరోనా వైరస్‌ మన శ్వాస వ్యవస్థపై అటాక్‌ చేస్తుంది. శ్వాస వ్యవస్థను స్ట్రాంగ్‌ చేసుకోవాలంటే ‘ప్రాణాయామం’ బ్రీతింగ్‌ ఎక్స్‌సైజ్‌ తప్పనిసరి. ప్రాణాయామంలో అనులోమ్‌, విలోమ్‌ చాలా పాపులర్‌‌. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు చాలా యోగాసనాలు ఉన్నాయి. ప్రతి రోజు ప్రాణాయామాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రపంచంలో కరోనా బారిన పడిన పేషంట్లు చాలా మంది యోగా వల్ల బెనిఫిట్‌ పొందుతున్నారు. ఇలాంటి కష్టసమయాలను ఎదుర్కొనేందుకు యోగా మనకు ధైర్యాన్ని ఇస్తుంది. శక్తి, పీస్‌ ఆఫ్‌ మైండ్‌ ఇస్తుంది” అని మోడీ అన్నారు. 2015 జూన్‌ 21 నుంచి ఈ యోగా డే నిర్వహిస్తుండగా.. ఈ సారి మాత్రం డిజిటల్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. “ యోగా ఎట్‌ హోమ్‌ అండ్‌ యోగా విత్‌ ఫ్యామిలో”అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా యోగా డే ఇంట్లోనే సెలబ్రేట్‌ చేసుకోవాలని, దాని వల్ల కుటుంబసభ్యులతో బంధం కూడా బలపడుతుందని మోడీ అన్నారు. యోగా ఐక్యతకు శక్తిగా నిలుస్తుందని, మానవత్వం, బంధాలను బలోపేతం చేస్తుందని అన్నారు. యోగాను ఎవరైనా స్వీకరించగలరని చెప్పారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన గ్రహాన్ని సృష్టించవచ్చని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఈ సందర్భంగా యోగా డే విషెస్‌ చెప్పారు. “ యోగా అనేది శరీరం, మనసు, ఆలోచన విధానం, పని, మానవత్వం, ప్రకృతి మధ్య సామరస్యాన్ని నెలకొల్పేందుకు ఒక సాధనం. మానవాళికి ఇచ్చిన విలువైన బహుమతి భారతీయ సంస్కృతి. మోడీ జీ చేసిన ప్రయత్నం వల్ల యోగా ప్రపంచం మొత్తం ప్రఖ్యాతి పొందింది” అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.