ప్రణీత్ ఇక గ్రాండ్​ మాస్టర్​...

ప్రణీత్ ఇక గ్రాండ్​ మాస్టర్​...
  • జీఎం టైటిల్​ అందుకున్న  హైదరాబాదీ
  • ఈ ఘనత సాధించిన రాష్ట్ర ఆరో ప్లేయర్​
  • ఇండియా తరఫున 82వ జీఎం​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,వెలుగు:  తెలంగాణ నుంచి మరో చెస్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ వచ్చాడు. కొన్నాళ్లుగా చదరంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్​కు చెందిన యువ ఆటగాడు ఉప్పల ప్రణీత్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ హోదా సాధించాడు. ఇది వరకే మూడు జీఎం నార్మ్‌‌‌‌‌‌‌‌లు అందుకున్న  15 ఏండ్ల  ప్రణీత్‌‌‌‌‌‌‌‌.. గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన 2500 ఎలో రేటింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు బాకు ఓపెన్‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో గెలిచాడు. ఎనిమిదో రౌండ్‌‌‌‌‌‌‌‌లో అమెరికా జీఎం,టాప్‌‌‌‌‌‌‌‌  హన్స్ నీమన్‌‌‌‌‌‌‌‌ను ఓడించడంతో 2500.5 ఎలో రేటింగ్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు. చివరి రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఓడినా రేటింగ్‌‌‌‌‌‌‌‌ తగ్గలేదు.

దాంతో, తెలంగాణ  నుంచి ఆరో, ఇండియా తరఫున 82వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు. ప్రణీత్‌‌‌‌‌‌‌‌ రెండు జీఎం నార్మ్‌‌‌‌‌‌‌‌లను గతేడాదే సాధించాడు. మూడో నార్మ్‌‌‌‌‌‌‌‌ కోసం తొమ్మిది నెలల పాటు వెయిట్‌‌‌‌‌‌‌‌ చేసి ఏప్రిల్​లో సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు రేటింగ్​ కూడా సాధించి జీఎం అయ్యాడు.  

నా టార్గెట్ వరల్డ్​ చాంపియన్‌‌‌‌‌‌‌‌​:  ప్రణీత్​

చిన్నతనం నుంచే చెస్‌‌‌‌‌‌‌‌పై ఆసక్తి పెంచుకున్న ప్రణీత్‌‌‌‌‌‌‌‌ ప్రముఖ కోచ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌వీఎస్‌‌‌‌‌‌‌‌ రామరాజు దగ్గర శిక్షణ తీసుకున్నాడు. మాగ్నస్‌‌‌‌‌‌‌‌ కార్ల్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌, అనటోలీ కార్పోవ్‌‌‌‌‌‌‌‌ను ఆరాధించే అతను  తక్కువ కాలంలోనే  జీఎం హోదా అందుకున్నాడు.  తన టార్గెట్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలవడమేనని ప్రణీత్​ అంటున్నాడు. ‘ఒక కల నిజమైంది. నా జీవితంలో ఇది మర్చిపోలేని క్షణం.

నా ప్రస్తుత లక్ష్యం 2500 ఎలో రేటింగ్‌‌‌‌‌‌‌‌ను దాటాలి. తర్వాత 2700 రేటింగ్‌‌‌‌‌‌‌‌ అందుకోవాలి. నా ఫైనల్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ గెలవడమే.  జీఎం టైటిల్​ తర్వాత ఎవరైనా స్పాన్సర్​షిప్​ ఇస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.