ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ .. డిసెంబర్ 9న ఎస్‌‌‌‌ఐబీలో ఫైళ్లు మాయం

ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ..   డిసెంబర్ 9న ఎస్‌‌‌‌ఐబీలో ఫైళ్లు మాయం

గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్ హయాంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ దుర్వినియోగం గుట్టురట్టైంది. ప్రతిపక్ష నేతలు, కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు అనుమానం ఉన్న అధికారుల ఫోన్ల ట్యాపింగ్‌‌‌‌ రహస్యం బయటపడింది. స్పెషల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌(ఎస్‌‌‌‌ఐబీ) కేంద్రంగా నడిచిన సీక్రెట్‌‌‌‌ ఇల్లీగల్‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌ను కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌ ఒక్కొక్కటిగా వెలుగులోకి తెస్తున్నది. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌కు అనుకూలమైన ఫలితాలు రావడంతో మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ టీమ్ అప్రమత్తమయ్యింది. వివిధ డిపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లోని ఫైల్స్ మాయం అయ్యాయి. దీంతో పాటు అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్‌‌‌‌ డేటాను ధ్వంసం చేసేందుకు ప్రణీత్‌‌‌‌రావు ప్లాన్ చేశాడు. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌పై ఆధారాలను మాయం చేసేందుకు యత్నించాడు. గత ప్రభుత్వంలో జరిగిన సీక్రెట్‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌, ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ వివరాలు బయటకు పొక్కకుండా ఎస్‌‌‌‌ఐబీ రూమ్‌‌‌‌లో ఆధారాలను ధ్వంసం చేశాడు. 

Also read : నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి

డిసెంబర్ 9న రాత్రి 9 గంటల తర్వాత ఎలక్ట్రీషియన్‌‌‌‌ సాయంతో బిల్డింగ్‌‌‌‌లోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయించి స్పెషల్ ఆపరేషన్స్‌‌‌‌ టార్గెట్స్‌‌‌‌ లాగర్‌‌‌‌లోకి ప్రవేశించారు. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌కు సంబంధించిన ఆధారాలు లభించకుండా ఫైల్స్‌‌‌‌ను సెల్లార్‌‌‌‌లోకి తెచ్చి కాల్చేశాడు.