ప్రాంజల–శ్రావ్యకు ఐటీఎఫ్‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌టైటిల్‌‌‌‌‌‌‌‌

ప్రాంజల–శ్రావ్యకు ఐటీఎఫ్‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌టైటిల్‌‌‌‌‌‌‌‌

గుర్గామ్‌: తెలుగు టెన్నిస్‌‌‌‌‌‌ప్లేయర్లు ఎడ్లపల్లి ప్రాంజల–శ్రావ్య శివాని.. ఐటీఎఫ్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ–15 విమెన్స్‌‌‌‌‌‌‌‌వరల్డ్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌‌‌టోర్నీలో డబుల్స్‌‌‌‌‌‌‌టైటిల్‌‎ను గెలుచుకున్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రాంజల–శ్రావ్య 6–4, 6–0తో మహికా ఖన్నా–సోహిని మొహంతిపై గెలిచారు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌‌‎లో ప్రాంజల జోడీ బలమైన షాట్స్‌‎‌‌‌తో ఆకట్టుకుంది. కీలక టైమ్‌‎లో ప్రత్యర్థుల సర్వీస్‌‎‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసి ఆధిక్యాన్ని కాపాడుకున్నారు.

విమెన్స్‌‌‌‌‌‌‌‌సింగిల్స్‌‎లో జీల్‌‌‌‌‌‌‌‌దేశాయ్‌‌‌‌‌‌‌‌ 2–6, 6–1, 6–4తో శ్రుతి అహ్లావత్‌‎పై నెగ్గి టైటిల్‌‎ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో రెండో ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఆడిన జీల్‌‌‌‌‌‌‌‌కు ఇది తొలి టైటిల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ట్యూనీసియాలో జరిగిన మొనాస్టిర్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో రన్నరప్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. బిల్లీ జీన్‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ విశాల్‌‌‌‌‌‌‌‌ ఉప్పల్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ‘ద టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌’ పేరుతో ఈ టోర్నీని నిర్వహించారు.