దేవాదాయ శాఖలో ‘ప్రసాద్’ పనులు.. 6 నెలల్లో చెయ్యాలి

దేవాదాయ శాఖలో ‘ప్రసాద్’ పనులు..  6 నెలల్లో చెయ్యాలి

పద్మారావునగర్, వెలుగు: బల్కంపేట శ్రీఎల్లమ్మ, పోచమ్మ  ఆలయాన్ని కేంద్ర పర్యాటక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సౌవనా సారంగి సోమవారం సందర్శించారు. ప్రసాద్ పథకం కింద అమలు చేయబోయే పనుల పురోగతిని ఆరా తీశారు. 

పర్యాటక శాఖ అధికారులతో సమావేశమై పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. 

రోడ్లు, పార్కింగ్, తాగునీటి సౌకర్యాలు, స్వచ్ఛత, సూచిక బోర్డులు వంటి వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అన్ని పనులను వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఆలయ అభివృద్ధి ద్వారా పర్యాటక రంగం మరింత ప్రోత్సాహం పొందుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.